Swami Saranam Ayyappa Saranam

  • Home
  • Swami Saranam Ayyappa Saranam

Swami Saranam Ayyappa Saranam Welcome to devotes

17/12/2021
04/10/2018

ఆలయాలు - న్యాయస్థానాల ప్రభావం

సనాతనధర్మంలో ఒక ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఆ మూలమూర్తిని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని రకాల మంత్రాలతో ఆవాహన చేసి ఆ మూర్తికి ద్విగుణీకృతమైన శక్తి రావడంకోసం కొన్ని రకాల మంత్రాలను కూడా అక్కడి ఆగమం బట్టి ప్రతిష్ఠిస్తారు. ఆ ఆగమ శాస్త్ర ప్రకారమే అక్కడ పూజావిధి, నియమనిష్ఠలు నిర్ణయింపబడతాయి. ఎప్పుడో ఒక ఆగమం ప్రకారం ప్రతిష్ఠించిన దేవాలయానికి సంబంధించి వాటి నియమాలను ఉల్లంఘించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. అసలు ప్రశ్నించడం కూడా విచారకరం.

మనము కూడా చూడండి....ఒక్కొక్క మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తాము. అలా పాటిస్తేనే మనము దానికి సంబంధించిన ఫలితాలను పొందగలుగుతాము. మన ఋషులు త్యాగశీలురు కాబట్టి వారు ఆ మంత్రాధిష్ఠాన దేవతలను దర్శనం చేసి ఆ మూర్తి యొక్క రూపురేఖలను, పూజా విధానాలను మనకు అనుగ్రహించారు. ఇప్పుడిప్పుడు పాశ్చ్యాత్యులు ప్రయోగాలద్వారా కనుక్కుంటున్నటువంటి విషయాలను మనవాళ్ళు కొన్ని వేల ఏళ్ళ క్రింద తెలియచేశారు. అంత గొప్పదైనటువంటిది మన ఋషుల యొక్క తపశ్శక్తి మరియు మన సనాతనధర్మం యొక్క గొప్పతనం.

ఉదాహరణకి చూడడం....మనందరం కూడా శ్రీలలితాసహస్రనామాలు చాలా శ్రద్ధగా పారాయణ చేస్తాము. అవి చాలా ప్రభావితం అయినవి కూడా. వాటి గొప్పతనం గురించి మనందరికీ తెలుసు. తెలియక వితండవాదం చేసేవారికి మొన్నీమధ్య కాలంలోనే విదేశీ శాస్త్రజ్ఞులు లలితాసహస్రనామాల శబ్దతరంగాలను ఒక గదిలో బంధించగా ఆ ధ్వని తరంగాలన్నీ శ్రీచక్ర ఆకారాన్ని సంతరించుకున్నాయి. వాళ్ళు ఇలా నిరూపించి చెపితే మనకి నోట్లో చాకోలెట్ పెట్టినట్లు ఉంటుంది. అదే మన పూర్వీకులు చెప్పారు అన్నా! లేక ఈ పని చెయ్యడానికి ఈ నియమాలు పాటించాలి అని చెప్పినా! వేదికలెక్కి లేక కోర్టులకు ఎక్కి ప్రశ్నిస్తాము కానీ వాటి గొప్పతనాన్ని గ్రహించలేము.

నిజానికి శబరిమలైలో కొలువై ఉన్న ఆ శబరిగిరీశుని దర్శనం స్త్రీలు చేసుకోవద్దు అని ఆగమం చెప్పడంలేదు. ఆ పదునెనిమిది మెట్లు ఎక్కి దర్శించుకోవద్దు అని మాత్రమే చెపుతున్నారు. ఎందుకంటే ఆ 18 మెట్లు ఎక్కాలంటే మండలం రోజులపాటు దీక్ష శ్వీకరించి కొన్ని నియమాలు పాటించినవారికిమటుకే ఆ మెట్లు ఎక్కే శక్తిని వారు పొందుతారు. అంత పవిత్రమైనవి ఆ పదునెనిమిది మెట్లు. మరి స్త్రీ శారీరక నిర్మాణరీత్యా కాలానుగుణంగా వచ్చే మార్పులరీత్యా 41 రోజుల పాటు దీక్షగా ఉండటం సాధ్యం అయ్యే విషయం కాదు. అందుకనే 9 సంవత్సరాల వయస్సులోపల పిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన స్త్రీలు వెళ్ళవచ్చు (ఋతుక్రమం ఆగిపోయినవారు). మరి ఈ నిబంధన ఉన్నప్పుడు స్త్రీలని ఈ వయసు వారిని అనుమతిస్తున్నప్పుడు ఇక అక్కడ సమానత్వం అని కానీ....అణగద్రొక్కడం కానీ ఎక్కడ ఉంది. ఆలోచిస్తే మనకే అవగతం అవుతోంది కదా! పోనీ కోర్టు తీర్పు ఇచ్చింది కదా అని సనాతనధర్మాన్ని నమ్మే స్త్రీలు ఆ ధర్మానికి చెందినవారు ఖచ్చితంగా వెళ్ళరు. ఎందుకంటే వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి భుజస్కంధాలపైనా ఉంది. మన సనాతనధర్మంలో ఉన్న విషయాలను మనమే ప్రశ్నించుకుని రోడ్లు ఎక్కడం కలి ప్రభావమేమో? సనాతనధర్మానికి చెందినవారు, దాన్ని నమ్మేవారు ఎవరూ ప్రశ్నించరు. ప్రశ్నించేవారు ఏమీ తోచక సమాజంలో ఇలాంటి ముసలాలను సృష్టించి వారు తప్పుకుంటారు. మిగతావారు కొట్టుకు చస్తారు.

ఎక్కడా కూడా స్త్రీని తక్కువ చేయలేదు. మన శాస్త్రాలు పైగా వారికి పెద్దపీటను వేశాయి. అయ్యప్పస్వామి బ్రహ్మచారి అయినప్పటికీ శక్తితో కూడి తానే ఆ మూర్తికి మన కోర్కెలు తీర్చే శక్తి వస్తుంది. అందుకే చూడండి. పూర్ణపుష్కళాసమేత అయ్యప్పస్వామి అని ఆయన అష్టోత్తరశతనామావళిలోనే ఉంది. అంతటి మాలికాపురుషోత్తమంజుమాత కూడా కొండపైకి వెళ్లడం లేదే !!!???

ఒక వైద్యుడు రోగికి మందులు రాస్తూ 5 రోజులపాటు మూడు పూటలా మందులేసుకోమంటే ఒకే పుటలో ఆ మందు అంతా వేసేసుకున్నాడు అనుకోండి....అది వికటిస్తుంది. ఆచారవ్యవహారాలూ అంతే! మనము bathroom లో పడుకోలేము, పడకగదిలో పూజా చేయలేము. వేటికి ఉపయోగించాల్సింది వాటికే ఉపయోగించాలి. ఈ మూర్తిని ఎలా ఉపాసన చెయ్యాలో అలానే చెయ్యాలి కానీ మన ఇష్టమొచ్చిన రీతిలో ఉపాసన చేస్తే అది బెడిసికొడుతుంది. రేపటి రోజు ఎవరైనా "తాను చెప్పులతోనే దేవాలయాలకి వెళ్ళాలి...వద్దంటే వ్యక్తి స్వాతంత్ర్యమును అడ్డుకున్నట్లే" అని కోర్టు మెట్లు ఎక్కుతారామో? ఎక్కితే వెంటనే మన ధర్మాసనం ఇది సరి అయినదే "హిందూ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకునే వెళ్ళాలి" అని తీర్పు ఇవ్వడం....అది Breaking News కావడం రివాజై పోతుంది. వాళ్ళకెందుకు చెప్పండి దేవాలయాలతో?

సనాధానధర్మాల విషయంలో మరియు ఆచారవ్యవహారాలలో మరియు ఆలయాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి జోక్యాలవల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా యువత కొన్ని నియమ నిబంధనల్ని తిలోదకాలు ఇచ్చేసి ఆచారవ్యవహారాల్ని పాటించకుండా వారి ఇష్టం ఒచ్చిన రీతిలో ప్రవర్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నియమాలు పాటించాలని నిర్బంధిస్తే కోర్ట్ కి వెళతామంటూ మన సనాతనధర్మంలో ఉన్న మంచి విషయాలను వారు నేర్చుకుని అలవర్చుకునేటటువంటి అవకాశాలు తగ్గిపోయి కోర్ట్ కి ఎక్కే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మన ఆచారవ్యవహారాలను మనము కాపాడుకుంటూ ఇంతే పదిలంగా మన ముందు తరాలకు అందించడానికి మనందరం నడుం బిగిద్దాం.

రండి కదలి రండి.........

"స్వామియే శరణమయ్యప్ప"

సర్వేజనా సుఖినోభవంతు....

09/02/2016
14/04/2015
10/04/2015

అంబరీషుడు అనే మహర్షి ఘోరమైన తపస్సు చేశాడు. భూమిమీద ఎండిపోయి రాలిన ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కొన్నాళ్ళు, నీటిని ఆహారంగా తీసుకుంటూ కొన్నాళ్ళు, గాలినే ఆహారంగా తీసుకుంటూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తరువాత గాలిలో తేలుతూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసాడు. ఆ పిదప జలం లోపల తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి ఒకనాడు తన నీటిలో తన ఎదురుగ వచ్చిన ఒక చేప కుటుంబాన్ని చూసి ఆహా! దీని అదృష్టమే అదృష్టం. చక్కటి భార్య, పిల్లలతో దీని కుటుంబం కళకళ లాడుతుంది. నాకు కూడా ఇలా ఒక కుటుంబం ఉంటె బావుండు అనుకోని ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు.
ఆ దేశపు రాజుగారికి ముగ్గురు మగ సంతానం. యాభై మంది ఆడ సంతానం. ఆ అంబరీష మహర్షి ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే మహర్షిని ఆహ్వానించి ఆర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి గౌరవించి మహర్షి పాదాలను కడిగిన జలాన్ని తలపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడుగగా; భూమీశా! నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నీకుమర్తెను ఇవ్వు అని అడిగాడు. మహర్షి! భూసురోత్తమా! తపస్సంపన్నులైన మీమాట నేను కాదనగలనా! స్వయంవరంలో గెలుచుకోండి అని సమాధానం చెప్పాడు మహారాజు. అప్పుడు మహర్షి తన మనస్సులో ఇలా అనుకొన్నాడు.
ఆడపిల్లలు ఎప్పుడైనా తనకు ఈడు జోడుగా, అందంగా ఉండేవాడిని భర్తగా స్వీకరిస్తారు కాని ఎక్కడైనా ముసలివాడిని భర్తగా స్వీకరిస్తారా? వారి రాతి సౌఖ్యాన్ని వృద్ధుడు అందించగలడా? ఒకవేళ అందించినా వృద్ధుడిని ఏ యువతీ కోరుకోదు కదా! ప్రేయసి కోర్కెలను ప్రియుడు తీర్చగలడు కాని వృద్ధుడు తీర్చగాలడా? స్వయంవరంలో దేశదేశాల నుండి ఎందఱో మహారాజులు, వారి బిడ్డలు వస్తారు. వారిలో అందగాడిని కోరుకుంటారు కాని ఈ వృద్ధుడిని కోరుకుంటారా? అని తర్కించి మహారాజు వద్ద సెలవు తీసుకొని మహర్షి వెళ్లి తన తపశ్శక్తితో యువకుడిలా మారి మరలా మహారాజు దగ్గరికి రాగా మహారాజు అంబరీష్ మహర్షిని చూసి ఆశ్చర్యపోయి తన యాభై మంది కుమార్తెలు ఉండే అంతఃపురానికి పంపించాడు.
(పూర్వం మహర్షులు, బ్రాహ్మణులు ఏదైనా కోరితే కాదు లేదు అనకుండా రాజులు ఇచ్చేవారు. తన కూతురు, కొడుకు, ఆస్తి చివరకి ప్రాణంతో సహితంగా ఇచ్చేసేవారు. అది ఆనాటి వారి గొప్పతనం)
ఆ యాభైమంది కుమార్తెలు అంబరీషుడిని చూడగానే మన్మథుడు గాని దిగివచ్చాడా? ఇంద్రుడా! అంటూ చుట్టూ చేరి నాకంటే నాకు నాకు అని ఎగబడ్డారు. మహారాజుగారు విషయం తెలుసుకొని ఈ యాభై మంది కూతుర్లనిమహర్షికి ఇచ్చి వివాహం జరిపించి అతనితోపాటు అడవికి పంపించాడు. అలా తన వెంట వచ్చిన తన భార్యలతో కలిసి అడవిలో తన తపశ్శక్తితో అందమైన భవనం నిర్మించి అనేక భోగాలు అనుభవించాడు. భవనంలో, కొండ గుహలలో, చెట్ల మొదల్లలొ, నదీ తీరాలలో, ఆకాశంలో, పాతాళంలో ఇలా ఇది అది కాకుండా ఆ యాభై మందితో అనేక సంవత్సరాలు కూడి ఐదు వేలమంది సంతానాన్ని పొందాడు.
చివరికి విసుగు చెంది ''నేను మహర్షిని అంట, గొప్ప యోగి నంట, నాకు సంసారమట, యాభై మంది భార్యలట, ఐదు వేల మంది సంతానమట, బుధజనులకు, మహర్షులకు తెలిస్తే నవ్వరా? ఇదంతా చేప సంసారం చూసి, వాటి సంతానాన్ని చూసి నా మనస్సు చేసిన మాయ అని గ్రహించి గొప్ప తపస్సు చేసి హరిని ధ్యానించి హరిలో ఐక్యం అయ్యాడు. యాభై మంది భార్యలు మహర్షిని అనుసరించి హరి ధామం పొందారు. ఆ ఐదువేల సంతానంలో అందరు తల్లి దండ్రుల మార్గాన్ని అవలంభించి శ్రీహరిలో ఐక్యం అయ్యారు. వీరిలో మిగిలిన ముగ్గురు సంతానం మూడు రాజ్యాలకు అధిపతులై పరిపాలించి యజ్ఞ యాగాదులు, క్రతువులు ఒనరించి శ్రీహరిని మెప్పించి వీరు కూడా వైకుంట వాసులయ్యారు..
వేల సంవత్సరాల తపస్సు చేసి చేసిన చిన్న పొరబాటు వలన సంసారం సాగరంలో చిక్కి పూర్వజన్మ కర్మ ఫలం, అతని తపశ్శక్తి వలన తిరిగి నిజం తెలుసుకుని శ్రీహరిలో ఐక్యం అయ్యాడు. భర్తని అనుసరించిన భార్యలు, తండ్రిని అనుసరించిన కొడుకులు కూడా శ్రీహరినే చేరుకున్నారు.
నీతి : భర్త అనుసరించే భార్యలు, తండ్రిని అనుసరించే కొడుకులు సాధించలేనిది ఏముంటుంది? వంశాన్ని పవిత్రం చేసి తరతరాలు చెప్పుకునేలా చరిత్రలో నిలిచిపోయారు.. ఇది కృతయుగంలో జరిగిన ఇతిహాసం..

Address

J. Parashuram

518004

Alerts

Be the first to know and let us send you an email when Swami Saranam Ayyappa Saranam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swami Saranam Ayyappa Saranam:

  • Want your business to be the top-listed Clothing Store?

Share