Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar Member Of Legislative Assembly (2009-14 & 2024)
Denduluru constituency

17/08/2026

దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వంలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంపై గ్రామాల్లో ప్రజల్లో వెల్లివిరిసిన ఆదరణ అభిమానాలు, రాష్ట్రంలో గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు, కొల్లేరు లీజు డబ్బులు ఎగ్గొట్టి తప్పుడు ప్రచారాలతో తప్పించుకు తిరుగుతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీరుపై విమర్శలుతో పాటు కుల మత వర్గాలకు అతీతంగా సమైక్యంగా ఉన్న దెందులూరు నియోజకవర్గంలో వ్యక్తిగత దూషణలతో లాభం లేదని గ్రహించి కుల చిచ్చు పెట్టాలని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న కొందరి తీరును ఎండగడుతూ, గురువారం జబర్దస్త్ షో వచ్చినట్టు ఆదివారం అయితే ఒక కొత్త పిచ్చోడు షో పెడుతుంటాడు అని, అలాంటి వాళ్ళ కోసం పట్టించుకునే అవసరం, స్థాయికి తమకి లేదని, కానీ వాళ్ళ తీరు ఇకనైనా మార్చుకోకపోతే సరైన బుద్ధి త్వరలోనే గట్టిగా చెప్తామని హెచ్చరిస్తూ ఏలూరులోని జిల్లా పరిషత్ అతిధి గృహంలో దెందులూరు నియోజకవర్గం కూటమి నాయకులు సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు..

"అలాగే దెందులూరు నియోజకవర్గంలో తప్పుడు పనులు చేసే వ్యక్తులు తమ కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలని చూస్తే ఎవరిని ఉపేక్షించబోమని, కూటమి ప్రభుత్వం అటువంటి వ్యక్తులపై సరైన చర్యలు తీసుకుని బుద్ధి చెబుతుందని, ప్రజలు కూడా తమ వంతుగా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు..

ఈ మీడియా సమావేశంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా గారు, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత గారు, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని గారు, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్ గారు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ గారు , రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నేతల రవి గారు, కూటమి నాయకులు మంచినేని శ్రీనివాస్ గారు, కమ్మ శివరామకృష్ణ గారు, నంబూరి నాగరాజు గారు, చవాకుల బాలాజీ గారు సహా పలువురు దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు..

10/07/2026

ఇద్దరు చిన్నపిల్లలతో హైదరాబాద్ నుండి చికాగో బయలుదేరిన దంపతులు వాళ్ళ పాస్ పోర్టులు పోగొట్టుకోవడంతో హాంగ్ కాంగ్ ఎయిర్ పోర్టులోనే మూడు రోజులు గడపాల్సివచ్చింది. ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ వారు పెట్టిన ఒక ట్వీట్ దేశం కాని దేశంలో వారిని ఆదుకుని అండగా నిలిచింది. లోకేష్ గారి మానవతా దృక్పథానికి ఇదొక నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ గారి దూకుడు! అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ...
07/07/2026

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ గారి దూకుడు!

అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్లు, కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో కీలక సమావేశాలు. సరికొత్త సాంకేతికతను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు!



06/07/2026

“Even leaders within YSRCP are opposing ’s Ma-Vi-Gun proposal.” Says



[Chintamaneni Prabhakar, MaViGun, Jaganmohan Reddy, Denduluru]

https://youtu.be/r_FY6Jc1JiE

విజయవాడ లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించడం జరిగింది
06/07/2026

విజయవాడ లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించడం జరిగింది

05/07/2026

Face to Face with Chintamaneni Prabhakar

Promo Out Now

Full video releasing on this evening



[Chintamaneni Prabhakar Denduluru Telugudesam Party Eluru]

ప్రజలు నుండి స్వీకరించిన అర్జీలను అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం  చూపాలిఈ రోజు స్వీకరించిన అర్జీలు 103మొదటి విడత "ఒక నెల...
03/07/2026

ప్రజలు నుండి స్వీకరించిన అర్జీలను అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం చూపాలి

ఈ రోజు స్వీకరించిన అర్జీలు 103

మొదటి విడత "ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు

జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం. జె.అభిషేక్ గౌడ పాల్గొన్నారు

దెందులూరు నియోజకవర్గం దెందులూరు మండల ప్రజా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం దెందులూరు మండలానికి సంబంధించిన మొదటి విడత "ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ లు సంయుక్తంగా పాల్గొని ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజలు సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. నేడు స్వీకరించిన అర్జీలుపై పరిష్కరించిన పూర్తినివేదికలు, ఫొటోస్ తో సహా వచ్చే సమావేశానికి హాజరు కావాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యలను పారదర్శకంగా పరిష్కరించి ప్రజలకు మరింత చేరువకావాలని, పరిష్కారం కాని సమస్యలుపై అర్జీదారులకు సరైన కారణాలను వివరించాలని పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలను కాలయాపనలు చెయ్యకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఒక్కసారి వచ్చిన అర్జీ మరలా రాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి అధ్యయనం చేసి పరిష్కారం చెయ్యాలని అన్నారు.

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రత్యేక ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. నియోజవర్గంలో ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మరో మూడు పర్యాయములు నిర్వహించడం జరుగుతోందని, ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ సమస్యలను కూడా అర్జీలు సమర్పిస్తే అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 22 (ఏ) భూసమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి, పూర్తిస్థాయిలో భూసమస్యలు పరిష్కరించాలని అన్నారు. అర్జీలను పరిశీలించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముగింపు చెయ్యవద్దని కోరారు. అధికారులు సేవాభావంతో, సానుకూల దృక్పథంతో సమస్యలు పరిష్కారానికి కృషిచెయ్యాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని, నియోజకవర్గంలో నిరుపేద అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చెయ్యాలని కోరారు. నియోజకవర్గంలో కొంతమంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని, విచారణ చేసి వారిని తొలగించి అర్హులకు పింఛన్లు మంజూరు చెయ్యాలని కోరారు.

ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని

దెందులూరు మండలం తిమ్మన్నగూడెం గ్రామ నివాసి నరావుల వీరవెంకట సత్యనారాయణ నా భూమిని అక్రమిస్తుకున్నారని, విచారణ చేసి పరిష్కారం చూపాలని కోరారు, దెందులూరు మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాసరావు రౌడవరిగుంట కాలువ ఆక్రమణకు గురైందని, సర్వేచేసి ఆక్రమణలు తొలగించి పరిష్కారం చెయ్యాలని కోరారు, దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన కొక్కిరిపాటి నాగరాజు గాంధీనగర్ క్రొత్తకాలనీలో ఒక రహదారి మాత్రమే ఉందని, రెండవ రహదారిని ఏర్పాటు చెయ్యాలని కోరారు, దెందులూరు మండలం కొవ్వలి గ్రామం మల్లవరపు పద్మావతి మాకు ఉమ్మడి ఆస్తి తగదాలు ఉన్నాయని పరిష్కరించాలని అర్జీని ఇచ్చారు, దెందులూరు మండలం శ్రీరామపురం గ్రామనివాసులు మోతుకూరి నరసింహ శోభనబాబు దెందులూరు రైల్వేగేటు మూసి నెలరోజులు అయిందని, గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నామని పరిష్కారం చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మిప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టరు వి.వి.యస్.శర్మ, జిల్లా, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు, తహశీల్దారు బి.సుమతి, యంపిడివో కె.వీరప్రతాప్, ఏయంసి ఛైర్మన్ గారపాటి రామసీత, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ...............................................................

Kutami 💛❤️🧡
02/07/2026

Kutami 💛❤️🧡

Address

Vijayawada
520012

Website

Alerts

Be the first to know and let us send you an email when Chintamaneni Prabhakar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share