Kakatiya Mega Textile Park

Kakatiya Mega Textile Park Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kakatiya Mega Textile Park, Textile Company, Vill: SHAYAMPET HAVELI, Mnd: GEESUGONDA, Dst: WARANGAL, Warangal.

Kakatiya Mega Textile Park, Warangal spread over 1350 Acres is the largest Textile park in India The KITEX units are gea...
27/06/2023

Kakatiya Mega Textile Park, Warangal spread over 1350 Acres is the largest Textile park in India

The KITEX units are gearing up for inauguration by Hon’ble CM KCR Garu in a couple of months 👍

16/06/2023

రేపు అనగా 17 జూన్ 2023 శనివారం రోజున‌ వరంగల్ శాయంపేట లోని KMTPలో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తున్న కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి గౌరవ పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి వర్యులు శ్రీ Kalvakuntla Taraka Rama Rao - KTR గారు శంకుస్థాపన చేయబోతున్నారు....

★ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఇది మరో కలికితురాయి కాబోతున్నందుకు వరంగల్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు.....

★ ఫామ్ టు ఫ్యాషన్ … ఫైబర్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో ఏర్పాటైన దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్. 1190 ఎకరాలు. 1150 కోట్ల రూపాయల పెట్టుబడి. దాదాపు 200 వస్త్ర కంపెనీలు. లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి. దాదాపుగా 4 లక్షల మందికి పరోక్ష ఉపాధి. ఇది వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రొఫైల్. ఈ నెల 17న ఈ పార్క్ మరో మైలురాయిని దాటనుంది. అదేంటో, దాని విశేశాలేమిటో, వరంగల్ వస్త్ర పరిశ్రమ గొప్పతనమేమిటో ఒకసారి చూద్దాం...

★ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే నాణ్యమైన పత్తి పంటకు పెట్టింది పేరు. ఈ పత్తికి సరైన విలువను కల్పించేందుకు నాటి 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1934 సంవత్సరంలో 200 ఎకరాల్లో 10వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఆజం జాహి మిల్స్ ను ప్రారంభించారు...

★ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని గొప్ప మిల్లుగా వెలుగొందిన ఈ మిల్ సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురై 1990లో మూతపడింది. మిల్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి కోసం దిక్కులేక బొంబాయి, బీవండి, సూరత్, పూణే ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లారు...

★ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమరథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆజం జాహి మిల్ కార్మికుల కష్టాలను చూసి కంటతడి పెట్టారు. బొంబాయి, బీవండి, సూరత్ కార్మికుల గోడును విన్నారు. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఆజం జాహి మిల్ కంటే గొప్ప స్థాయిలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పత్తికి, వస్త్ర ఉత్పత్తికి పున: వైభవం తీసుకొస్తానని, వలసవెళ్లిన కార్మికులను మళ్లీ వరంగల్ కు తీసుకొస్తానని హామీ ఇచ్చారు...

★ ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2015లోనే మూడు రోజుల పాటు వరంగల్ లో తిరిగి త్వరలోనే దేశం అబ్బురపడే విధంగా 2వేల ఎకరాల్లో టెక్స్ టైల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు...

★ పాటు వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కోసం మొదటి దశలో 1190 ఎకరాల భూసేకరణ చేపట్టి, 2017 అక్టోబర్ 22న ఫామ్ టు ఫ్యాషన్ … ఫైబర్ టు ఫ్యాబ్రిక్ నినాదాలతో అంగరంగ వైభవంగా వైభవంగా దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. రెండో దశలో మరో 800 ఎకరాల్లో విస్తరించనున్నారు.....

★ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా మౌలిక వసతులు సంపూర్ణంగా కల్పించి, రైల్వే మార్గాన్ని, మామునూరు ఎయిర్ పోర్టును కూడా అభివృద్ధి చేసి వరంగల్ నుంచి నేరుగా దేశ, విదేశాలకు ఇక్కడ తయారైన వస్త్రాలను ఎగుమతి చేసే విధంగా వసతులు కల్పిస్తున్నారు....

★ గత ఏడాది మే7వ తేదీన టెక్స్ టైల్ పార్కులో మొట్టమొద‌టి యూనిట్ గణేష్ ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 50 ఎకరాలస్థలంలో 588 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్ దారాలు తయారు చేసి, వస్త్రాలు ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు ఈ దారాలను ఎగుమతి చేస్తోంది. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దుస్తుల త‌యారీ సంస్థ అయిన కేరళకు చెందిన కిటెక్స్‌ కంపెనీకి 187.24 ఎకరాల స్థలంలో శంకుస్థాప‌న చేశారు. 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో 11 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా 840 కోట్ల రూపాయల పెట్టుబడితో 12వేల మందికి ఉపాధి కల్పించే ఎవర్ టాప్ కంపెనీకి 261.83 ఎకరాల స్థలంలో శంకుస్థాపన చేశారు...

★ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో వస్త్ర ఉత్పత్తి కోసం ఇప్పటికే 22 కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్నాయి. 7 కంపెనీలు వాటి నిర్మాణాలు పూర్తి చేశాయి.

★ ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కేటిఆర్ గారు స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి 800 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తున్న కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి టెక్స్ టైల్ పార్క్ లో శంకుస్థాపన చేయనుండడం పట్ల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు.

★ ఈ కంపెనీ ఏర్పాటుతో జిల్లాలో ప్రత్యక్షంగా దాదాపు 12 వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉపాధి లభించనున్నది. కావునా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వరంగల్ వస్త్ర నగరి ఖ్యాతిని పెంచేందుకు తోడ్పడాలని కోరుతున్నాను...

★ మేకిన్ ఇండియా అనే పేరుతో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు నినాదానికి పరిమితమై, ఆజాది కా అమృతోత్సవానికి చైనా నుంచి జాతీయ జెండాలను తయారు చేయిస్తుంటే...సిఎం కేసిఆర్ నాయకత్వంలో మేకిన్ తెలంగాణ విజయవంతంగా కొనసాగుతోంది. విదేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. మెగా టెక్స్ టైల్ పార్క్ మేకిన్ తెలంగాణ నినాదాన్ని నిజం చేస్తూ దేశ, విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని విస్తరింపజేస్తోంది.








📣Announce the entry of KITEX group, world’s 2nd largest manufacturer of kids apparel into Telangana with an initial inve...
09/07/2021

📣Announce the entry of KITEX group, world’s 2nd largest manufacturer of kids apparel into Telangana with an initial investment of ₹1,000 Cr

They’ve chosen Kakatiya Mega Textile Park, Shayampet Haveli,Warangal for their factories.

17/12/2019




Today Korea   Company Team visited
11/12/2019

Today Korea Company Team visited

07/12/2019


➡️An Integrated world class destination for Textile Value Chain.➡️Telangana is the third largest producer of cotton fibr...
20/08/2019

➡️An Integrated world class destination for Textile Value Chain.
➡️Telangana is the third largest producer of cotton fibre in india.







➡️The biggest textile Park in India, foundation stone laid on 22 October 2017 at Shyamapet in Gesugonda mandal of Warang...
12/08/2019

➡️The biggest textile Park in India, foundation stone laid on 22 October 2017 at Shyamapet in Gesugonda mandal of Warangal Rural district, Telangana by the Chief Minister of Telangana, Kalvakuntla Chandrashekhar Rao.





👉Few pics from Kakatiya Mega Textile Park  !!!✅ ✅ ✅ ✅ ✅
10/08/2019

👉Few pics from Kakatiya Mega Textile Park !!!




➡️ Power Supply Substation for Kakatiya Mega Textile Park !!! ✅ ✅ ✅ ✅
26/07/2019

➡️ Power Supply Substation for Kakatiya Mega Textile Park !!!



✅ ✅ ✅
21/07/2019



Address

Vill: SHAYAMPET HAVELI, Mnd: GEESUGONDA, Dst: WARANGAL
Warangal
506330

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakatiya Mega Textile Park posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share